Bank jobs: డిగ్రీ పాసయ్యారా..ఈ బ్యాంకు ఉద్యోగాలకు అర్హులే..!!

చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి బ్యాంకు ఉద్యోగాలు కాస్త ఊరటనందిస్తున్నాయి. మధ్యప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. ఈ పోస్టులకు అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవాలంటే చివరి తేదీ కూడా దగ్గరకు వస్తోంది. వెంటనే అప్లైకి సన్నద్ధం కండి. దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్లో మాత్రమే అవకాశం.

ఉద్యోగాల వివరాలు:
క్లర్క్ /కంప్యూటర్ ఆపరేటర్, కాంటాక్ట్ మరియు సొసైటీ మేనేజర్ మొదలైన పోస్టుల మొత్తం 2253 రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఎంపిక విధానం :
మధ్యప్రదేశ్ కోపరేటివ్ బ్యాంకు లోని ఈ పోస్టులను రాత పరీక్ష ద్వారా తీసుకుంటారు. ఈ పరీక్ష కూడా ఆన్లైన్లోనే నిర్వహించబడుతుంది. ఈ పరీక్ష కోసం అప్లై చేసిన అభ్యర్థులకు వారం రోజుల ముందుగానే అడ్మిట్ కార్డు ఇవ్వబడుతుంది. పరీక్ష ముగిసిన 10 రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి. తాజా అప్డేట్ కోసం అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ apexbank.in లో చెక్ చేస్తూ ఉండాలి.

ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటుగా ఇంగ్లీష్ హిందీ టైపింగ్ పై పరిజ్ఞానం కలిగి ఉండాలి. అంతేకాకుండా ఏడాది పాటు కంప్యూటర్ డిప్లమా కోర్స్ కూడా పూర్తి చేసి ఉండాలి. 26, డిసెంబర్ 2022 నాటికి చివరి తేదీ.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం కోసం జనరల్ మరియు ఓబిసి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 500 రూపాయలు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు 250 రూపాయల ఫీజును చెల్లించవలసి ఉంటుంది.

Bank jobs: డిగ్రీ పాసయ్యారా..ఈ బ్యాంకు ఉద్యోగాలకు అర్హులే..!!