ఈ ఏడాది తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే స్టార్ నటులైన కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ తాజాగా చలపతిరావు ఇండస్ట్రీని వీడి దివికెగిసారు. ఇలా సీనియర్ యాక్టర్లు వరుస మృతులతో ఇండస్ట్రీ అంతా అతలాకుతలమవుతోంది. ఆదివారం తెల్లవారుజామున సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది.
1944 మే 8న కృష్ణా జిల్లాలో జన్మించిన చలపతిరావు 1200 కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయనకు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు. చలపతిరావు నటన ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకం అని చెప్పవచ్చు. చలపతిరావు ఇండస్ట్రీలో చాలామంది నటీనటులతో చాలా ఆప్యాయంగా మాట్లాడే వారట. ఈయనను అందరూ బాబాయ్ బాబాయ్ అంటూ పిలిచేవారట. అంతటి గొప్ప నటుడు మరణించడం అందరిని బాధిస్తోంది.
చలపతిరావు మొదటిసారి నటించిన చిత్రం గూడచారి 116. చివరి చిత్రం ఓ మనిషి నీవెవరు.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చలపతి రావు అకాల మరణం ఇండస్ట్రీని మొత్తం శోకసద్రంలో ముంచేసింది. ఆయన మరణ వార్త తెలుసుకున్న ఇండస్ట్రీ ప్రముఖులంతా ఒక్కొక్కరిగా చలపతిరావు ఇంటికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.
Chalapathi rao: సీనియర్ నటుడు చలపతిరావు మృతి..!!