- ఘనంగా ముగిసిన ప్రపంచ తెలుగు 5 వమహాసభలు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేష సాయి మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
- ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్ ఈడీ విచారణకు నాంపల్లి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో ఉన్నాను నందకుమార్ ను సోమవారం జైల్లోనే ప్రశ్నించనుంది ఈడీ.
- రిషి సునక్ సర్ప్రైజ్ కాల్స్: తన యొక్క సిబ్బందికి క్రిస్మస్ సందర్భంగా సర్ప్రైజ్ కాల్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
- దేశ భవిష్యత్తు కోసమే నూతన విద్యా విధానంతో సరికొత్త విద్యా వ్యవస్థను సృష్టించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
- విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన మూవీ ” వారీసు” ఆడియో వేడుకను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఈ సినిమాను తల్లిదండ్రులందరికి అంకితం ఇస్తున్నానని అన్నారు.
6.జాతీయ మహిళల ఎలైట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ యువతి నికత్ జరీన్ పథకం ఖాయం చేసుకుంది.
- వచ్చేయడాది మార్చిలోపు పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేయకపోతే అది చెల్లుబాటు కాదని ఆదాయం పన్ను విభాగం తెలియజేసింది.
- ప్రేమ వివాహారమే ప్రాణం తీసిందా: నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో శుక్రవారం అర్ధరాత్రి ఆదివాసి చెంచు యువకుడ్ని ఎవరో హత్య చేశారు. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమైనట్టు తెలుస్తోంది.
9.చైనాలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. కనీసం ఆసుపత్రులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్మశాన వాటికల్లో శవాలు కుప్పలు తెప్పలుగా ఉంటున్నాయి.
10.గడ్డ కట్టించే స్థాయిలో అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాన్. దీనివల్ల చాలాచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.