Tspsc notification: 50 వేల నుంచి లక్షన్నర జీతం.. ఏ శాఖలో అంటే..?

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (tspsc) ఈ మధ్యకాలంలో వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలోనే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన టిఎస్పిఎస్సి నిరుద్యోగులకు మరో శుభవార్త. అందించింది. త్వరలో మరో నోటిఫికేషన్ విడుదల చేయనుందని తెలుస్తోంది.

వెటర్నరీ మరియు పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (class A&B) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్ -1, మల్టీజోన్-2 ఖాళీలను భర్తీ చేయనుంది. మరి ఏ ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.. వాటిని ఏ విధంగా దరఖాస్తు చేయాలనే విషయం పూర్తిగా తెలుసుకుందాం..

అర్హతలు :

  • మొత్తం 185 పోస్టులను భర్తీ చేయనున్నారు.
  • ఇందులో ముఖ్యంగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (CLASS-A)170, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (CLASS-B) 15 పోస్టులున్నాయి.
  • వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాసు ఏ) పోస్ట్ కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ ( వెటర్నరీ సైన్సెస్ యానిమల్ హస్బెండరీ) లేదంటే తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అంతే కాకుండా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ బి) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ ( వెటర్నరీ సైన్సెస్ యనిమల్ హస్బెండరీ), పీజీ లేదా పీజీ డిప్లమా ( మైక్రో బయాలజీ / ఎపిడెమియాలజీ, వైరాలజీ, పారాసిటాలజీ, పాథాలజీ, ఇమ్యునాలజీ ) లేదంటే మాస్టర్స్ డిగ్రీ, వెటర్నరీ సైన్స్, లేదా ఎం వి ఎస్ సి( వెటర్నరీ పబ్లిక్ హెల్త్ ) పాస్ అయి ఉండాలి.
  • ముఖ్యంగా ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థుల వయసు 01-07-2022 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • దరఖాస్తు ఫీజు 320 రూపాయలు..
  • ఎంపికైన అభ్యర్థికి 54220-1,33,630 నెల జీతం చెల్లిస్తారు.
  • చివరి తేదీ 19-01-2023.