- ధాన్యం కల్లాల పైన కేంద్రం కుట్రలు చేస్తోందని భారతీయ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు అన్నారు. కేంద్రంలో ఉన్నది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఎద్దేవ చేశారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కలిసి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
2.దోపిడీకి చిరునామా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని రాజాం సభలో చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని అని చెబుతూనే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని తెలియజేశారు.
- ప్రపంచ దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో మన దేశంలో కూడా ఎక్కువ అయ్యే పరిస్థితులు వచ్చిన ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాలని కేంద్ర రాష్ట్ర అధికారులకు ప్రధానమంత్రి మోడీ సూచించారు.
- విజయమే ఎక్కువ ఒత్తిడి అన్నారు కార్తికేయ 2 హీరో నిఖిల్. నన్ను పాన్ ఇండియా లెవెల్ హీరో అన్న ప్రతిసారి ఒత్తిడి గానే అనిపిస్తుందని తెలియజేశారు. కార్తికేయ 2 విజయాన్ని ఇంకా నేను సెలబ్రేట్ చేసుకుంటున్నానని అనుకుంటున్నారు. కానీ నా దృష్టి అంతా తర్వాత చిత్రంపై ఉందని అన్నారు.
- నేడు IPL మినీ వేలం: ఐపీఎల్ సమరానికి ముందే మరొక సమరం జరగనుంది. ఇదేదో పరుగుల కోసం అనుకునేరు,కాదు కాదు కేవలం ఆటగాళ్ల ఎంపిక కోసమే.ఇది పేరుకు మాత్రమే మినీ వేలం స్ట్రోక్స్, కామెరాన్ గ్రీన్, సామ్కరన్ వంటి ఆల్ రౌండర్స్ ఈరోజు జరిగే వేలంపై ఆసక్తిని పెంచేస్తున్నారు.
- రిలయన్స్ చేతిలోకి మెట్రో ఇండియా : దేశవ్యాప్తంగా వారి యొక్క రిటైల్ వ్యాపారాన్ని రిలయన్స్ సంస్థ మరింత బలోపేతం చేసుకుంటోంది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ టోకు వ్యాపారాలను 2850 కోట్లకు కొనుగోలు చేసింది.
- దడ పుట్టిస్తున్న బీఎఫ్ 7 :
ప్రపంచ దేశాల్లో చైనా కరోనా కల్లోలంతో విలవిలాడుతోంది. ఇప్పటికే బిఎఫ్ 7 వేరియంట్ దాటికి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ వేరియంట్ ఇండియాలోకి కూడా వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. - 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అమ్మేశారు : కిడ్నాప్ అయిన 15 సంవత్సరాల బాలిక ఒక వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురైన సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
- ఉక్రెన్ కు అమెరికా అందించే సాయం విరాళం కాదని, అది ప్రపంచ భద్రతకు పెట్టుబడి అని అధ్యక్షుడు జలన్ స్కి అన్నారు .
- విద్యార్థులకు అమెరికా వీసాలు కష్టమేనా: అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు, వీసా మరియు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా మారిందని అంటున్నారు.