చాలామంది కొత్త కొత్త ఆశలతో వచ్చే సంవత్సరానికి స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారు. కొంతమంది వచ్చే ఏడాది వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే ఆందోళనతో ఉన్నారు. 2023 జనవరిలో ఈ 5 గ్రహాల గమనంలో మార్పు రాబోతోందని , ఇందులో ముఖ్యంగా కర్మని ఇచ్చే శని దేవుడు జనవరి 17న ముందుగా కుంభరాశిలో సంచరిస్తాడని , అంతేకాకుండా జనవరి 14న గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడని , జనవరి 22న శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడని అంటున్నారు జ్యోతిష్యనిపుణులు. దీని తర్వాత జనవరి 12న అంగారకుడు ప్రత్యక్షంగా జనవరి 18న బుధుడు ప్రత్యక్షంగా ఉంటాడని, దీని ప్రభావం జనవరి 18వ తేదీన కనిపిస్తుందని, ఈ టైంలో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
మేష రాశి :
ఈ రాశివారికి జనవరిలో కొంత ప్రతికూలంగా ఉంటుందని, ఈ నెలలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలని, వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. వీరు చేసే ప్రధాన పనులు ఆగిపోవచ్చని వారు తెలియజేస్తున్నారు.
కర్కాటక రాశి:
జనవరి నెల ఈ రాశి వారికి కూడా హానికరం. ఈ సమయంలో వీరు భాగస్వామితో సంబంధాలు చెడిపోవచ్చు. చిన్న చిన్న విషయాలకే కోపానికి వచ్చి అనేక సమస్యల బారిన పడవచ్చు. డబ్బు వస్తుంది కానీ ఖర్చు ఎక్కువవుతుంది.
వృశ్చిక రాశి:
జనవరి నెలలో మీకు డబ్బు పరంగా బాగానే ఉంటుంది కానీ, పూర్వీకులకు సంబంధించి ఆస్తి వివాదాలు తెరపైకి రావచ్చు. దీనివల్ల కుటుంబంలో కాస్త అనిచ్చితి ఏర్పడుతుంది.
కుంభరాశి :
జనవరి నెలలో వీరికి కూడా కలిసి రాదు. కారణం ఏంటంటే జనవరిలో శని దేవుడు సంచరించిన వెంటనే మీకు రెండవ దశ సడెషత్ ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరు చేసే పని విషయంలో అజాగ్రత్తగా ఉండద్దు.
January 2023: కొత్త ఏడాది ఈ 4 రాశుల వారికి అనేక ఇబ్బందులు..!!