బీటెక్ చేసిన వారికి గుడ్‌న్యూస్ హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 2022-23 సంవత్సరానికి గానూ 212 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈసీఈ, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్, సివిల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్, నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 212
- ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ఖాళీలు: 150
- డిప్లొమా అప్రెంటిస్‌షిప్ ఖాళీలు: 62
విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్, సివిల్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హతలు
అప్రెంటిస్‌షిప్‌ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. వయసు: 25 ఏళ్లు మించకూడదు. అప్రెంటిస్‌షిప్ వ్యవధి: 1 ఏడాది. ఎంపికైన వారికి స్టైపెండ్: నెలకు రూ.9000, టీఏ. రూ.8000 చెల్లిస్తారు. క్వాలిఫైయింగ్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చివరి తేది: డిసెంబర్ 26, 2022 అప్రెంటిస్‌షిప్ శిక్షణ ప్రారంభం: జనవరి 02, 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:https://www.ecil.co.in/
ECIL Hyderabad Recruitment:బీటెక్ చేసిన వారికి హైదరాబాద్‌లో ఉద్యోగాలు