ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో పార్టీలన్నీ వారి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు సీఎం కేసీఆర్. దీంతో ఆయన దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని అనుకోని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇదే అదునుగా భావించిన బిజెపి వారి ఆలోచనలకు పదును పెడుతూ వస్తోంది. ఎలాగైనా తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బండి సంజయ్ తన యాత్రలతో రాష్ట్రాన్ని ఓ చుట్టు చుట్టేస్తున్నారు. ఈ తరుణంలోనే ఢిల్లీ పెద్దలు మరో ముందడుగు వేసి తెలంగాణ రాష్ట్రం నుంచి మరొక వ్యక్తికి కేంద్రం మంత్రి పదవిని ఇవ్వనుంది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పటికే వారిలో ఒకరు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.
మరి ఈసారి ఉత్తర తెలంగాణ నుంచి మరో నేతకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. 2019 పార్లమెంటరీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు ఎంపీ సీట్లు బిజెపి గెలుచుకుంది. సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి, నిజాంబాద్ నుండి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుండి బండి సంజయ్, అదిలాబాదు నుండి సోయం బాపూరావు విజయం సాధించారు. ఇక యూపీ నుంచి లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర సంస్కృతిక మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈ తరుణంలో మిగిలింది మరో ఇద్దరు ఎంపీలు మాత్రమే.
వీరిలో లక్ష్మణ్ మరియు ధర్మపురి అరవింద్ పేర్లను కేంద్ర క్యాబినెట్ పరిశీలనలో తీసుకున్నట్టు తెలుస్తోంది. బిజెపి గెలిచిన నాలుగు సీట్లలో మూడు సీట్లు ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతం నుంచి మంత్రి పదవిని కట్టబెట్టాలని కేంద్రం ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి పదవిలో ఉన్నారు. ఇప్పుడు లక్ష్మన్ కి ఇస్తే హైదరాబాద్ కే మళ్ళీ ప్రాధాన్యత ఇచ్చారనే భావన కలుగుతుంది. ఈ తరుణంలో ఉత్తర తెలంగాణలో నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఆయనకు పదవి వరిస్తుందా మరి ఇంకెవరికైనా బీజేపీ పెద్దలు ఇస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.
TELANGANA: తెలంగాణకు మరో కేంద్రమంత్రి..ఆ ఎంపీకే రానుందా..?