మన భారతదేశ సంప్రదాయం ప్రకారం మన పుట్టిన తేదీని బట్టి ఏ రాశికి చెందినవారు, జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాలను జ్యోతిష్యనిపుణులు తెలియజేస్తూ ఉంటారు. అలాంటిదే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుదారిత్య రాజయోగం చాలా పవిత్రమైనదట. ఎవరి జాతకంలో అయినా సరే ఈ రాజయోగం వారు రాజకీయాల్లో మాత్రం చాలా విజయాన్ని సాధిస్తారని, అంతేకాకుండా ప్రజా దారణని పొందుతారని అంటున్నారు. మరి బుధారీత్యా రాజయోగం ఏర్పడే రాశుల వారు ఎవరు వారికి ఏ సమయంలో లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కుంభరాశి :
ఈ రాశి వారిలో భూదారీత్యా రాజయోగం శుభ సూచకంగా ఉంటుంది. వీరి యొక్క జాతకంలో 11 వ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఇది ఆదాయ లాభాల యొక్క ప్రవేశంగా భావించబడుతుంది. ఈ టైంలోనే వీరు ఏవైనా పాత పెట్టుబడులు ఉంటే వాటి నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
మిధున రాశి:
ఈ రాశి వారికి కూడా భూదారీత్యా రాజయోగం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏడవ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. దీనివల్ల వారి యొక్క వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. వీరు పనుల విషయంలో ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఈ పనులు కూడా వారికి అనేక లాభాలను తెచ్చి పెడతాయి. ఈ రాశుల వారు వివాహం యొక్క ప్రతిపాదనను పొందవచ్చు.
వృషభ రాశి :
ఈ రాశి వారిలో భూదారీత్యా రాజయోగం ఏర్పడటంతో మంచి రోజులు వస్తాయి. ఎందుకనగా ఈ రాశి నుండి ఎనిమిదవ ఇంట్లో యోగం ఏర్పడుతుంది. ఈ క్రమంలో మీరు వ్యాపారంలో లాభాలను పొందవచ్చు. అంతేకాకుండా ఉద్యోగాలు మారాలని భావించే వారికి అనుకూలమైన సమయం. సూర్య భగవానుడి కారణంగా వీరు కొత్త కొత్త బాధ్యతలు పొందగలరు.