December 19 top news: ఈరోజు ముఖ్యవార్తలు :

  1. తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభ వాతావరణం. హైకమాండ్ ఎప్పుడైతే కొత్త పీసీసీ పదవులను ప్రకటించిందో అప్పటినుంచి రెండు నుంచి మూడు రోజులు సైలెంట్ గా ఉన్న నాయకులు అందరూ ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సీతక్క తో సహా మొత్తం 13 మంది నాయకులంతా రేవంత్ రెడ్డి పై తిరుగుబాటు జెండా ఎగరవేశారు.
  2. ఆంధ్రప్రదేశ్ లో జనసేన మరియు వైసీపీ పార్టీ మధ్య మాటలు యుద్ధం జరుగుతోంది. సత్తెనపల్లిలో పర్యటిస్తున్న పవన్ వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. వారాహిని టచ్ చేసి చూడండి తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే చూస్తారు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.
  3. ఎంతో ఉత్కంఠగా సాగిన బిగ్బాస్ గ్రాండ్ ఫినాలే లో రేవంత్ సంచలన విజయనందుకున్నాడు. ఇక సెకండ్ ప్లేస్ లో శ్రీహాన్ సూట్ కేస్ ఆఫర్ను తీసుకొని సర్ది పెట్టుకున్నాడు. దీంతో ఆరో సీజన్ ముగిసింది.
  4. జపాన్ యొక్క ఏడో టోక్యో మ్యూజియం, సింగపూర్ లో ఉన్నటువంటి జరాంగ్ బర్డ్ పార్కుతో పాటుగా టాప్ టెన్ టూరిస్ట్ ప్లేస్ అయిన 2023 జాబితాలో హవోయి రైలు వీధిని చేర్చేసింది. వియత్నం ప్రభుత్వం రైలు యొక్క స్ట్రీట్ దుకాణం యొక్క లైసెన్స్ రద్దు చేస్తూ ట్రాక్ లను మూసేసింది..
  5. ఎంతో ఉత్కంఠ గా తాగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ పోరులో చివరి నిమిషం వరకు ట్విస్టులతో సాగిన ఈ యొక్క మ్యాచ్లో చివరి పంచ్ అర్జెంటీనాది అయింది.
  6. భారత సంతతికి చెందినటువంటి లియో వరదఖర్ ఐర్లాండ్ దేశ ప్రధానిగా రెండవసారి ఎన్నికయ్యాడు. పెన్గేల్ పార్టీకి చెందినటువంటి ఈయనకు రొటేషన్ పద్ధతిలో ఈ పదవి వరించింది.