జేమ్స్ కామెరూన్ ను సినీ దర్శకుడు అని చెప్పే కంటే సినిమా దేవుడు అని చెప్పడం బెటర్.. ఆయన సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను మెప్పించగల ధీరుడు. అలాంటి జేమ్స్ సినిమా తీయాలి అంటే తన ఆలోచన విధానం మరో లెవల్ లో ఉంటుంది. ఒక ఆలోచన వచ్చింది అంటే దాన్ని సహకారం చేసుకోవడానికి ఎన్ని ఏళ్ళైనా వెనకాడడు. తన నమ్మకాన్ని తీసేయడు. అదే స్థాయిలో సినిమా కోసం కష్టపడతాడు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎవరైనా చాన్స్ ఇవ్వకపోతారని ఎదురు చూస్తూ ఉంటారు.
ఇది కామనే కానీ, కానీ ఈ దర్శకుడు తనకు వచ్చిన ఆలోచన కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం అనేది నిజంగా గొప్ప ఆలోచనగా చెప్పవచ్చు. ఎంతో సాంకేతికత ఏళ్ల తరబడి శ్రమ వేలకోట్ల బడ్జెట్ ఇన్నిటి మధ్య ఇంతటి సినిమా తీయడం చాలా గొప్ప విషయమే. ఫలితం గురించి ఆలోచించకుండా ప్రయత్నించడం అంటే జేమ్స్ కామెరిన్ ఒక 100 మంది రాజమౌళి తో సమానం అని చెప్పవచ్చు. అలాంటి దర్శకుడు జేమ్స్ కామెరున్ ఒక జానపదాన్ని పోలినటువంటి ది వే ఆఫ్ వాటర్ ని తీసిన విధానం అయితే అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
మూడు గంటల పాటు ఉన్న రన్ టైంపై కాస్త పెదవి వివరిస్తున్నా, అన్ని గంటలు ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చోబెట్టగలడా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా జేమ్స్ కామరూ న్ ప్రతి సినిమాలో కంటెంట్ పక్కగా ఉండేలా చూసుకుంటారు . అంతేకాకుండా ఎమోషన్స్ కూడా పండేలా చూసుకుంటాడు. ఆయన సినిమా ఒక్కసారి థియేటర్ కి వెళ్లి చూసి రివ్యూ ఇవ్వాలి తప్ప పనికిమాలిన రివ్యూ లేస్తూ అంతటి సినిమాను పాడు చేయొద్దని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
జేమ్స్ కామెరూన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?