తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు సునీల్.. ఆయన కామెడీ ఏ విధంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. టైమింగ్ కు తగ్గ కామెడీతో ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించే సత్తా సునీల్ సొంతం.. అలాంటి సునీల్ కమెడియన్ గా చేస్తూనే సినిమాలో హీరోగా కూడా సక్సెస్ అయ్యారు. ఈ విధంగా పలు సినిమాలు చేసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం సినిమాల్లో కమెడియన్ హీరో, విలన్ పాత్రలు కూడా చేస్తూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు.. అలాంటి సునీల్ ఇండస్ట్రీకి రావడానికి చాలా కష్టాలు పడ్డారు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు ఆయన వివిధ పనులు చేశారు.. అవేంటో ఇప్పుడు చూద్దాం సునీల్ భీమవరం దగ్గర ఉన్న పెద్దపల్లి గ్రామంలో జన్మించాడు..
ఈయన పూర్తి పేరు ఇందుకూరి సునీల్ వర్మ.. సునీల్ తండ్రి పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసేవారు.. సునీల్ చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో ఆ ఉద్యోగం వారి తల్లికి వచ్చింది.. ఈ విధంగా తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో సునీల్ తల్లి వారి అమ్మ వాళ్ళ ఊర్లో నివసించేది. సునీల్ అక్కడే పెరిగాడు.. నాలుగో తరగతి వరకు అమ్మమ్మ వాళ్లు ఊరిలో చదివిన సునీల్..
ఆ తర్వాత భీమవరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.. ఈ క్రమంలోనే భీమవరం కాలేజీలో ఫిలిం ఆర్ట్స్ కోర్సులో చేరారు.. సునీల్ కు చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం ఎలాగైనా ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నాడు.. ఆయనకు చదువుకునే టైమ్ నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండడంతో తన స్నేహితుడైన త్రివిక్రమ్ తో కలిసి హైదరాబాదులో ఒకే రూమ్ లో ఉంటూ సినిమా ప్రయత్నాలు చేసేవారు.. ఓవైపు సినిమా ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు పార్ట్ టైం జాబ్ చేస్తూ చాలా రోజులు ఇండస్ట్రీలో తిరిగారు. ఛాన్సులు రాలేదు మళ్లీ భీమవరం వెళ్లిపోయాడు.
కానీ వారి కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ఇచ్చి మల్లి ట్రై చేయమని చెప్పడంతో మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో చిన్న పాత్ర చేశాడు.. ఆ తర్వాత నువ్వు నేను సినిమాలో హాస్యనటుడిగా అదరగొట్టాడు.. ఈ సినిమాకు నంది అవార్డు కూడా దక్కింది. దీంతో సునీల్ కెరియర్ మారిపోయింది. వరుస సినిమాలు చేసుకుంటూ బిజీ కమెడియన్ గా మారారు.. ప్రస్తుతం హీరోగా కూడా చేస్తున్నారు..
కమెడియన్ సునీల్ ఇండస్ట్రీ లోకి రాకముందు ఇలాంటి పని చేసేవారా..?