ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను విచారించేందుకు సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్నారు. సిబిఐ డిఐజి రాఘవేంద్ర వత్సా ఆధ్వర్యంలో కవిత ఇంటికి చేరుకున్న ఆరుగురు అధికారుల టీం విచారణ చేస్తోంది. ఇందులో ఒక మహిళ అధికారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా కవితకు సంబంధించిన న్యాయవాది కూడా అక్కడే ఉన్నారు. సిబిఐ కవిత నుంచి ఏం రాబడుతోంది.. అసలు లోపల ఏం జరుగుతుందనే దానిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హార్ట్ టాపిక్ గా మారింది.
విచారణ సందర్భంగా కవిత ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత వద్ద ఏదైనా సమాచారం ఉందా అనేది తెలుసుకోవడానికి అధికారులు ఆమెను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర, బ్యాంకు లావాదేవీలు, నిందితులతో ఉన్న సంబంధాలపై ప్రశ్నలు అడుగుతున్నట్టు సమాచారం. ఢిల్లీలోని ఒబెరా హోటల్లో లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత పాత్ర, సౌత్ గ్రూప్ లావాదేవీలు అంశాలు వంటి వాడిపై సిబీఐ ప్రశ్నిస్తోందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తెరాస నేతలు మాత్రం సిబిఐ అధికారులు కవిత విచారణ కోసం రాలేదని వివరణ కోసం వచ్చారంటూ చెబుతున్నారు. లిక్కర్ స్కాంలో కవిత పేరు ఎక్కడ లేదని ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా నమోదు కాలేదని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ కవితని ఏమేమి ప్రశ్నలు అడుగుతోంది, ఏ విధమైన సమాధానాలు రాబడుతోంది.. ఈ విచారణలో ఏం బయట పడుతుందనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.. ఇదే విషయమై మరికొన్ని గంటల్లో అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఎమ్మెల్సీ కవితకు CBI ప్రశ్నలు.. అసలు విషయం తేలిందా..?