ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఇంటికి సిబిఐ బృందం వెళ్లనుంది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకొని వాంగ్మూలం నమోదు చేయనున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో మాండవ్స్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన ఈదురు గాలులతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసింది. వైయస్సార్ జిల్లాలో వర్షాలకు గోడ కూలి ఒక మహిళ కూడా మృతి చెందింది. జలాశయాలన్ని పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమతంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మహారాష్ట్ర మంత్రి భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అయిన చంద్రకాంత్ పటిల్ పూణేలోని మిమ్రే పట్టణంలో పర్యటన చేస్తుండగా ఒక దుండగుడు సిరాతో దాడి చేశాడు..
హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వస్తున్న సరికొత్త మూవీకి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ ను ఫైనల్ చేశారు.. అంతకుముందు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఉండేది..
వన్డేల్లో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా లేకుండా డైరెక్ట్ గా డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు ఇషానే రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా చిన్న వయసులోనే డబల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా పేరు సంపాదించుకున్నాడు.
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ దంపతులతో పాటు కూతురు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరు దైవ దర్శనానికి వెళ్తున్న సమయంలో ప్రైవేట్ బస్సు వీరి కారును ఢీకొట్టింది.
డిజిటల్ రూపాయితో యూపీఐకి మంచి ప్రయోజనాలు ఉంటాయట. డిజిటల్ రూపాయిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే ప్రయోగ ప్రాజెక్టును ఆర్.బి.ఐ ఇప్పటికే నాలుగు ప్రధాన నగరాల్లో మొదలుపెట్టింది.
ఇరాన్ యొక్క డ్రోన్లతో రష్యా తమపై దాడి చేస్తుందని ఉక్రెయిన్ చేసినటువంటి ఆరోపణలకు బలం చేకూరేలా అమెరికా ఒక ప్రకటన విడుదల చేసింది..