నయనతార బ్యూటీ సీక్రెట్స్ లీక్.. అది లేకుండా బయటకు రాదట..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది నయనతార.. తను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పటికీ అదే అందంతో అందరినీ మెప్పిస్తోంది.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లు గడిచిన తరగని అందం ఆమె సొంతం.. మరి నయనతార అంతలా మెరిసిపోతుంది అంటే దాని వెనుక చాలా కష్టం ఉందట.. ఆమె అందం కోసం చాలా కష్టపడుతోందని, యంగ్ గా కనిపించేందుకు ఇలాంటి చిట్కాలు పాటిస్తుందట.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
సన్ స్క్రీన్ :
నయనతార నిపుణుల సిఫార్సు మేరకే సన్ స్క్రీన్ వంటి బ్యూటీ చిట్కాలను పాటిస్తుందట.. ఆమె ఎప్పుడు బయటకు వెళ్లిన సూర్యుడి నుంచి వచ్చే uv కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ వాడుతుందట..
పండ్ల రసాలు:
నయనతార 37 ఏళ్ల వయసులో చిన్న పిల్లలా కనిపించడానికి ప్రధాన కారణం పండ్ల రసాలు.. ఎక్కువగా పండ్ల రసాలను తాగుతుందని దీనివల్ల చర్మం మెరిసిపోతుందని తెలుస్తోంది.
ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం :
టాలీవుడ్,కోలీవుడ్ ముద్దుగుమ్మ నయనతార తన చర్మాన్ని కాపాడుకోవడానికి ప్రపంచంలోని టాప్ బ్యూటీ బ్రాండ్లను వాడకుండా ఉత్తమమైన ఆయుర్వేద ఆర్గానిక్ ఉత్పత్తులను ఉపయోగిస్తుందట.
మేకప్ లేకుండా ఉండటం:
నయనతార పెద్దగా మేకప్ వేసుకోవడానికి ఇష్టపడదు. ఆమె మేకప్ లేకుండా చేసిన చిత్రాలు అనేకం ఉన్నాయి.. ఎక్కువగా మేకప్ లేకుండా ఉండటానికి ఇష్టపడుతుందట..
హెల్తీ డైట్ :
నయనతార ఎప్పుడు హెల్తీ డైట్ ను ఫాలో అవుతుంది.. కూరగాయలు పండ్లు మాంసం మరియు గుడ్లు వంటి పోషకాహారం తీసుకుంటుంది.. ముఖ్యంగా కొబ్బరి నీళ్లపై ఎక్కువ ఆసక్తి చూపుతుందట..

నయనతార బ్యూటీ సీక్రెట్స్ లీక్.. అది లేకుండా బయటకు రాదట..!