దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.. ఈ దేవాలయానికి దేశంలోని నలుమూలల నుంచి కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేక చారిత్రక విషయాలకు నిలయం. ఇక్కడ మనకు తెలియని ఎన్నో విషయాలు ఆ కొండలపై దాగి ఉన్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పాలంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఇందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది అలిపిరి.. మరి అలిపిరి చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం..కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లడానికి తొలి ప్రవేశ మార్గం అలిపిరి. సోపాన మార్గంలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే. దీన్ని కొందరు అడిప్పడి అంటారు.పడి అంటే మెట్టు, అడి అంటే అడుగున ఉన్న భాగం. తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశం. కొందరు అలిపిరిని అడిప్పలిక్ అంటారు. వైష్ణవ క్షేత్రాలలో చింత చెట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
కొందరు అలిపిరి అంటే అల్ప శరీరం కరవాడని అంటారు. శ్రీవారి ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన. అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. ఈ ఆలయం పైకప్పు విడిపోవడంతో పాడైపోయింది. విగ్రహాల శిథిలమయ్యాయి. చివరికి అదృశ్యం అయిపోయాయి. ఈ ఆలయంలోని శిల్పకళ చిత్ర విన్యాసాలు చూడవచ్చు. అన్నమయ్య కాలంలో ఈ ఆలయం ఉండేది. ప్రస్తుత మీ ప్రదేశం లక్ష్మీనారాయణ ఆలయంగా తీర్చిదిద్దబడింది.