భోజనం తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. అయితే ప్రమాదమే..?

చాలామంది భోజనం తర్వాత కొన్ని రకాల పనులను చేస్తూ ఉంటారు. అయితే భోజనం తర్వాత వాకింగ్ చేస్తే మంచిదే కానీ, ఇలాంటి పనులు చేస్తే మాత్రం ప్రమాదమే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మరి భోజనం తర్వాత చేయకూడని పనులేంటో మనం చూద్దాం.. సాధారణంగా ఆహారం తిన్న వెంటనే పండ్లను తినకూడదు. ఆహారం తిన్న రెండు గంటల తర్వాత ఫ్రూట్స్ తినాలని, లేదంటే ఆహారం తినే గంట ముందు అయినా ఫ్రూట్స్ తినాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

అంతేకాకుండా ఆహారం తీసుకున్న వెంటనే టీ తాగకూడదు. తేయకులో ఉండే యాసిడ్స్ జీర్ణ సమస్యలు తీసుకువస్తాయని అంటున్నారు. కాబట్టి ఆహారం తినే ముందు మరియు తిన్న వెంటనే టీ తాగకూడదట. అలాగే ఆహారం తీసుకున్న వెంటనే సిగరెట్ తాగడం వల్ల చాలా ప్రమాదం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. తిన్న వెంటనే స్మోక్ చేయడం వల్ల 10 సీక్రెట్లు తాగిన దానితో సమానం అవుతుందని అంటున్నారు. ఇలా తరచూ చేయడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు..

అంతేకాకుండా ఆహారం తిన్న వెంటనే బెల్టును లూజ్ చేయడం వల్ల ఆహారం ప్రేగుల్లో పూర్తిగా చేరుకొని జీర్ణ సమస్యలు ఏర్పడేలా చేస్తుందట. మరీ ముఖ్యంగా ఆహారం తీసుకున్న వెంటనే స్నానం చేయకూడదని, స్నానం చేయడం ద్వారా చేతులు, కాళ్లలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆహారం జీర్ణం అయ్యే వ్యవస్థలో కాస్త ఇబ్బందులు అవుతాయి. అంతేకాకుండా ఆహారం తీసుకున్న వెంటనే నిద్ర పోకూడదు. ఇలా వెంటనే నిద్రపోవడం వల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్టిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

భోజనం తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. అయితే ప్రమాదమే..?