Keerthy Suresh:కీర్తి సురేష్ మొదటి పారితోషికం ఏం చేసిందో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ అందరిలో కీర్తి సురేష్ కు ఒక ప్రత్యేకత ఉంది. మహానటి సినిమా వరకు ఈ అమ్మడు పేరు అంతగా పరిచయం లేదు. కానీ మహానటి సినిమాలో సావిత్రి పాత్ర చేసిన తర్వాత కీర్తి సురేష్ టాప్ లెవెల్ హీరోయిన్ గా మారిపోయింది.

సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన కీర్తి తన అందం, అభినయంతో మంచి గుర్తింపును సాధించింది. కీర్తి సురేష్ బాలనటిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన సినిమా జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. బాలనటిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు నిర్మాతలు తన పారితోషికం కవర్లో పెట్టి చేతికి ఇచ్చేవారని అన్నది.

నిర్మాతలు అమౌంట్ కవర్లో పెట్టి ఇవ్వడం వల్ల తను ఎంత తీసుకున్నానో అనే విషయం అవగాహన లేకుండా పోయిందని తెలియజేసింది. కానీ మొదటి పారితోషకం తీసుకెళ్లి నాన్నగారికి ఇచ్చానని, ఇలా సినిమాల్లో వచ్చిన డబ్బంతా తన తండ్రి చేతికే ఇస్తానని చెప్పుకొచ్చింది.. ఇలా తన రెమ్యూనరేషన్ గురించి కీర్తి సురేష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి.