మన శరీరంలో కిడ్నీలు అనేవి ముఖ్య పాత్రను పోషిస్తాయి.. రక్తాన్ని శుభ్రపరిచి అందులోని మలినాలను వేరు చేస్తాయి. ఆ మలినాలు మూత్ర విసర్జన ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ఈ సమయంలో మూత్రం అనేది దుర్వాసన వస్తూ ఉంటుంది.. దుర్వాసన ఎందుకు వస్తుంది.. అనే విషయాలు చూద్దాం.. మూత్రం దుర్వాసన రావడానికి ముఖ్య కారణం డీహైడ్రేషన్.. నిత్యం మన శరీరానికి కావలసిన నీటిని మనం అందించాలి తక్కువ నీరు తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ సమస్య వస్తుందని డాక్టర్లు అంటున్నారు.. దీనివల్ల మూత్రం దుర్వాసన వస్తుందని తెలియజేస్తున్నారు.
అంతేకాకుండా మూత్రశయంలో ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగితే దీని వల్ల కూడా మూత్రం దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిహైడ్రేషన్ కాదని తెలిసిన తర్వాత కూడా మూత్రం దుర్వాసన వస్తుంది అంటే దానికి కారణం ఇన్ఫెక్షన్ అయి ఉండవచ్చని భావించాలి. అంతేకాకుండా కిడ్నీలలో రాళ్లు ఉండటం వల్ల కూడా మూత్రంలో దుర్వాసన వస్తుంది.
అంతేకాకుండా జ్వరం, వాంతింగ్స్, రక్తస్రావం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే డయాబెటిస్ ఉన్న వారిలో కూడా మూత్రం దుర్వాసన వస్తుందని డాక్టర్లు అంటున్నారు. ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని వారు కోరుతున్నారు.
మూత్రం దుర్వాసన వస్తుందా.. అయితే ప్రమాదమే..!!