గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ టిపి అధ్యక్షురాలు షర్మిల హల్చల్ చేస్తోంది. ఏ టీవీ ఛానల్ పెట్టిన ఈమె గురించి వార్తలు వస్తున్నాయి.. ఈ తరుణంలోనే మరో వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.. ప్రధానమంత్రి మోడీ షర్మిలకు కాల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.. మోడీ షర్మిల కి ఫోన్ చేసి ఇటీవల ఆమెపై జరిగిన దాడి గురించి తెలుసుకున్నారట.. ఢిల్లీకి రావాలని కూడా ఆహ్వానించారట.. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారట.. ఈ ఘటన రాజ్యాంగానికి విరుద్ధమని తెలియజేస్తూ దాదాపు పది నిమిషాల పాటు షర్మిలతో మాట్లాడారట మోడీ..
అంతేకాకుండా జి20 సమావేశాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో కూడా మోడీ ఈ విషయాన్ని ప్రస్తావించారని, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని స్థాపించి కెసిఆర్ పై పోరాడుతున్న షర్మిలాను కారుతో సహా క్రేన్ కట్టి లాక్కెళ్ళిన, జైలుకు తరలించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇంతవరకు స్పందించలేదు.. ఈ విషయం తెలిసిన నాకు బాధ అనిపించింది.. ఇంత జరిగినా మీరు ఎందుకు రియాక్ట్ కాలేదని సీఎం జగన్ మోడీ ప్రశ్నించారట.. దీనిపై ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలియని జగన్ అలా నవ్వుతూ నిలబడినట్టు తెలుస్తోంది..
వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల పాదయాత్ర సందర్భంగా తీవ్రమైన దాడి జరిగింది. ఆమె కాన్వాయ్ ని అడ్డుకొని మరీ నిప్పంటించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బలవంతంగా షర్మిలను హైదరాబాద్ తరలించారు.. ఆ మరుసటి రోజు షర్మిల ప్రగతి భవన్ ముందు నిరసన వ్యక్తం చేస్తూ ధ్వంసమైన కారుతో సహా వచ్చారు.. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె కారులో ఉండగానే క్రేన్ తో కట్టి మరీ లాక్కెళ్ళారు. షర్మిలను పరామర్శించేందుకు వచ్చినటువంటి తన తల్లిని కూడా పోలీసులు అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ విధమైన ఘటనలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. దీంతో ప్రధాని మోడీ షర్మిలతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారని, ఢిల్లీకి కూడా రమ్మన్నారని వార్తలు వినిపిస్తున్నాయి..
షర్మిలకు ప్రధానిమోదీ ఫోన్.. ఢిల్లీకి రమ్మనడం వెనుక..!!