సావిత్రి చేసిన ఈ 3 తప్పులే ఆమె జీవితాన్ని నాశనం చేశాయా.. ఇందులో ఆ 1 దారుణం..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ఎల్లలు దాటించిన నటి సావిత్రి. తన కళ్లతోనే హవాభావాలు పలికించే ఈ ముద్దుగుమ్మ అప్పట్లో ఒక సెన్సేషనల్ అని చెప్పవచ్చు. ఈమె సినిమాలో హీరోయిన్ గా వస్తుంది అంటే ఆ మూవీ తప్పనిసరిగా సూపర్ హిట్టే. అలాంటి సావిత్రి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలను సైతం పక్కకు నెట్టేసిందని చెప్పవచ్చు.. సావిత్రి డేట్స్ కోసం, దర్శక నిర్మాతలే వేచి చూసేవారు అంటే మహానటి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.. అలాంటి సావిత్రి తన సినీ జీవితంలో కోట్లాది ఆస్తులను, ఎన్నో అవార్డులను, రివార్డులను దక్కించుకుంది..

కానీ సావిత్రి ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండే మనస్తత్వం. కోట్ల రూపాయలు సంపాదించి ఎంతోమంది పేదలకు దానధర్మాలు చేసింది.. అసలు ఆమె దానాలకు అంతు లేదని చెప్పవచ్చు.. అలాంటి సావిత్రి జెమినీ గణేషన్ ను వివాహం చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు సంసారం బాగానే సాగింది. ఆ తర్వాత వీరి మధ్య కాస్త విభేదాలు వచ్చాయి. దీంతో ఆమె జీవితం పెడదారిన పట్టింది.. తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చింది.. ముఖ్యంగా ఈ మూడు తప్పులు చేసి తనకు ఉన్నదంతా పోగొట్టుకుంది.. ఆ తప్పులు ఏంటయ్యా అంటే..

  1. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే నిర్మాతగా మారడం..
  2. జెమినీ గణేషన్ చేసిన అప్పులకు షూరిటీ సంతకాలు పెట్టడం..
  3. తన పరిధిని దాటి దానధర్మాలు చేయడం. ఈ మూడు తప్పులే ఆమెకు చివరి రోజుల్లో ఏమీ లేకుండా చేశాయి. అయినా సావిత్రి ఒకరి దగ్గరికి వెళ్లి చేయి చాచే పరిస్థితి మాత్రం తెచ్చుకోలేదు. మొండి పట్టుదలతో ఉన్నదాంట్లోనే సర్దిపెట్టుకొని చివరికి కన్ను మూసింది ఈ మహానటి. అలాంటి మహానటిది బర్త్డే సందర్భంగా మరోసారి యాదిలో..!