BIG BOSS6 TELUGU FAIMA:బిగ్ బాస్ పై మండిపడ్డ ఫైమా.. వారి మల్లె నేను ఎలిమినేట్ అయ్యానంటూ..!!

జబర్దస్త్,పటాస్ ఫైమాగా ఎంతో పేరు తెచ్చుకున్న కమెడియన్ ఫైమా బిగ్ బాస్ సీజన్ 6 లోకి చాలా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఏ మాత్రం తగ్గలేదు. జబర్దస్త్ నుంచి మరో కమెడియన్ చంటి వచ్చినప్పటికీ, ఆయనను కూడా డామినేట్ చేసి ఫైమా దూసుకుపోయింది అని చెప్పవచ్చు. టైం కు తగ్గ కామెడీ మరియు గేమ్స్ లో కూడా ముందుకు వెళ్తూ తనదైన స్ట్రాటజీ చూపించింది. ఇక వారం వారం గడిచినా కొద్దీ చాలామంది కంటెస్టెంట్లు అనుకోకుండా ఎలిమినేట్ అవ్వడం తో ఫైమా ఇంకా స్ట్రాంగ్ అవుతూ వచ్చింది.

ఈ తరుణంలో చాలామంది ఫైమా టాప్ 5లో ఉంటుందని భావించారు. కానీ ఆమెను బిగ్ బాస్ నుంచి అర్దాంతరంగా 13వ వారం ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఫైమా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేస్తూ మండిపడింది. తను ఎలిమినేట్ అవ్వాల్సింది కాదని, తన స్థానంలో కీర్తి లేదా శ్రీ సత్య లేదా ఆదిరెడ్డి,రోహిత్ వీరిలో ఎవరైనా అయి ఉండాల్సిందని, వారందరి కంటే నా పర్ఫామెన్స్ బాగుందని ఓట్లు కూడా ఎక్కువ పడ్డాయని, కానీ ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదని తెలియజేసింది.

బిగ్ బాస్ లో అవకాశం రావడం నా అదృష్టమే కానీ ఈ రకంగా ఎలిమినేట్ చేయడం బాధగా ఉందని, నేను ఎంతో ప్రాణం పెట్టి అందులో పర్ఫామెన్స్ చేశానని కేవలం ఒక్క టాస్క్ లో ఓడిపోయినంత మాత్రాన నా బిగ్ బాస్ జర్నీ ని అంచనా వేయడం తప్పని ఎమోషనల్ అయిందట.ఈ ఎలిమినేషన్ అంతా తప్పుగా జరిగిందని చెప్పుకొచ్చింది. నేను బయటకు వచ్చిన తర్వాత చాలామంది నన్ను అసలు నువ్వు టాప్ 5 ఉండాల్సింది అంటూ చెప్పారని ఫైమా ఎమోషనల్ అయిందంటూ సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వస్తున్నాయి.

బిగ్ బాస్ పై మండిపడ్డ ఫైమా.. వారి మల్లె నేను ఎలిమినేట్ అయ్యానంటూ..!!