సాధారణంగా కొంతమంది నవ్వినప్పుడు సొట్టబుగ్గలు పడుతూ ఉంటాయి. ఆ సొట్ట బుగ్గలు వారికి మరింత అందాన్ని ఇస్తాయి. అది మగవారైనా సరే ఆడవారైనా సరే వారు ఉన్న అందానికి ఈ సొట్టబుగ్గలు తోడైతే అందం మరింత ఎక్కువవుతుంది. అయితే ఈ సొట్టబుగ్గలు మరీ ఎక్కువ పడితే ముసలి వయసు కనిపిస్తుంది.. మరి కొంతమంది పండితులు సొట్ట బుగ్గలు పడితే అదృష్టం అని చెబుతూ ఉంటారు.. మరి ఆ సొట్టబుగ్గల వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. సొట్టబుగ్గలు కలిగి ఉన్న అమ్మాయిలకు అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుందట. వీరిని పెళ్లి చేసుకునే వారు జీవితంలో చాలా సుఖపడతారు. ఆర్థికపరంగా సంసారపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవట.
ఈ సొట్టబుగ్గలను కలిగి ఉన్న ఆడవారి జీవితంలో ప్రతిదీ ఒక టాస్క్ గా తీసుకొని నెరవేరుస్తారు. దీంతో వారితో ఉన్న వారి జీవితం కూడా సుఖమమయమవుతుంది. ఈ సొట్టబుగ్గలు ఉన్నవారు అనిగిమనిగి ఉంటారట. ఎదుటివారిని అస్సలు బాధపెట్టారు. వారి జోలికి వస్తే మాత్రం వెంటనే సమాధానం చెబుతారు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తూ ఉంటారు. సొట్టబుగ్గలు పడే వారికి ఎక్కువగా నవ్వు మొహమే ఉంటుంది. సొట్ట బుగ్గలు ఉన్నటువంటి భార్య వస్తే భర్తకు సుఖం ఉంటుంది కానీ అత్తకు మాత్రం కలిసి రాదని విష్ణు పురాణం చెబుతోంది.
కొన్నిసార్లు ఈ అమ్మాయిలు అత్తకు గండం గా కూడా మారవచ్చు. సొట్టబుగ్గ మగవారికి ఉంటే తల్లికి ఎక్కువ ఆయుష్షు ఉంటుందట. కానీ ఈ సొట్టబుగ్గ ఆడపిల్లకు ఉంటే మాత్రం అత్త పైకి పోవడం లేదంటే పోరు తట్టుకోలేకపోవడం వంటివి జరుగుతాయని విష్ణు శాస్త్ర పురాణంలో ఉంది. ఈ సొట్ట బుగ్గలు అనేవి జన్యుపరంగా వారి కుటుంబంలో ఎవరికైనా ఉంటే 25% మళ్ళీ వారి పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందట.
మీకు సొట్టబుగ్గలు ఉన్నాయా.. అయితే ఈ రహస్యం తెలుసుకోవాల్సిందే..?