ఈ కలలు వస్తున్నాయా.. అయితే మీ పంట పండినట్టే..?

చాలామంది రాత్రి సమయంలో కలలు కంటూ ఉంటారు.. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని పెద్దలు చెబుతుంటారు.. మరి స్వప్న శాస్త్రం ప్రకారం.. ఎలాంటి కలలు నిజమవుతాయి.. ఎలాంటి కలలు వస్తే మనకు అదృష్టం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. స్వప్న శాస్త్రం ప్రకారం మనకు కలలో దేవాలయం లేదంటే పూజారి కొబ్బరికాయలు లాంటివి కనబడినట్లైతే అవి మంచి కలలుగా చెప్పవచ్చు

. త్వరలో మనం శుభవార్త వింటామని భావించాలి. అంతేకాకుండా మీ కలలో మహాదేవుని ఆలయం కనిపించినట్లయితే త్వరలో మీరు శుభవార్త వింటారని అంటుంటారు.. అంతేకాకుండా మీ కలలో మామిడి చెట్లు కనిపిస్తే అది మీ పురోగతికి సాంకేతం అని చెబుతున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో పర్వతాన్ని అధిరోహించినట్లు కనబడితే మాత్రం మహాదేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయని సంకేతం.

అంతేకాకుండా మీ కలలో ఆవుపాలను తాగడం, లేదా చూడడం కనబడితే అది మీ ఆర్థిక సమస్యలు తొలిగిపోతున్నాయని అర్థం. అంతేకాకుండా మీ కలలో చిలుక లేదా గులాబీ పూలు కనిపిస్తే మీరు చేసే పనుల్లో సానుకూలత ప్రభావం చూపే అవకాశం ఉంటుందని బిజినెస్ పరంగా ముందుకు పోతారని స్వప్న శాస్త్ర నిపుణులు అంటున్నారు.

ఈ కలలు వస్తున్నాయా.. అయితే మీ పంట పండినట్టే..?