నిర్మలమ్మ వయసులో ఉన్నప్పుడు ఇంత అందంగా ఉండేదా..!!

అప్పట్లో వెండితెరపై ఎలాంటి బామ్మ పాత్రలు పోషించాలన్నా హీరోపై ప్రేమగా కోప్పడాలన్న ఈమని మించిన యాక్టర్ మరొకరు లేదని చెప్పవచ్చు.. ఇప్పటికే చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలకు తల్లిగా,బామ్మగా అనేక పాత్రలు చేసి తనదైన స్టైల్ లో మాటలతో అందరిని మెస్మరైజ్ చేస్తుంది.. ఆమె ఎవరో ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందా.. ఎవరో కాదండి బామ్మ నిర్మలమ్మ.. ఈమె పేరు చెప్తే మనకు గుర్తుకు వచ్చేది ఆమె బామ్మ పాత్రలు మాత్రమే..

అలాంటి నిర్మలమ్మ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టినప్పుడు హీరోయిన్ కు ఏమాత్రం తరగని అందంతో ఉండేది.. గయ్యాలి మాటలు తిట్టాలన్నా,మా బాబే మా బాబే అంటూ దగ్గరికి తీసుకోవాలన్నా ఈమెకి మించిన నటులు ఎవరూ లేరని చెప్పవచ్చు. అంతేకాదు కొన్ని సందర్భంలో నిర్మలమ్మ డేట్స్ కోసం సినిమాలను కూడా ఆపేవారు అంటే ఆమె క్రేజ్ ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిర్మలమ్మ అసలు పేరు రాజామణి. నాటకాలు అంటే విపరీతమైన అభిమానంతో, ఆమె కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించకపోవడంతో పెదనాన్న మద్దతుతో నాటకాల్లో రాణించింది.

ఆ విధంగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. 1943 పదహారేళ్ళ వయసులో ఓ సినిమాలో చెలికత్త పాత్ర ద్వారా మొదటిసారిగా తెరపై మెరిసింది. ఆ విధంగా ప్రారంభమైన ఆమె సినీ జీవితం ముందుకు సాగుతూ వచ్చింది. సుమారు 1000 కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అమ్మ బామ్మ పాత్రలు ఆమెకు చాలా పేరు తెచ్చాయి. అలాంటి నిర్మలమ్మ వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేదో ఇప్పుడు చూద్దాం.

నిర్మలమ్మ వయసులో ఉన్నప్పుడు ఇంత అందంగా ఉండేదా..!!