TG ప్రజలకు శుభవార్త: మరో కొత్త పథకం.. పది రోజుల్లో అమలు..!!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఆసరా పింఛన్లు పెంపు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల పథకాలు ప్రజల వద్దకు చేరుతున్నాయి. ఈ పథకాలతో చాలామంది ప్రజలు లబ్ది కూడా పొందుతున్నారు.. ఈ తరుణంలోనే కెసిఆర్ ప్రభుత్వం ప్రజల కోసం మరో కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.

మరి దాని వివరాలు ఏంటో చూద్దాం.. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేకూరేలా చాలా పథకాలు ప్రవేశపెట్టింది. ఇందులో ముఖ్యంగా గర్భిణీలకు పౌష్టికాహారం అందిస్తూ.. రక్తహీనత తగ్గించడం కోసమే న్యూట్రిషన్ కిట్స్ కూడా అందించబోతుందట.. అయితే ఈ పథకాన్ని రానున్న పది రోజుల్లో అమలు చేయనున్నామని హరీష్ రావు తెలియజేశారు.. కామారెడ్డి జిల్లాలోని బీచ్ కుందలో డయాలసిస్ సెంటర్ ను ఓపెనింగ్ చేయడానికి వచ్చిన హరీష్ రావు ఈ విషయాన్ని బయటపెట్టారు..

త్వరలోనే న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.. ఈ కిట్టులో ఒక కేజీ న్యూట్రిషన్ పౌడర్, ఒక కేజీ ఖర్జూర పండ్లు, ఒక ఆల్బెండజోల్ మాత్ర, మూడు బాటిల్ల ఐరన్ సిరప్ లు, 1/2 కేజీ నెయ్యి ఉంటాయని తెలియజేశారు. ఈ కిట్లను లబ్ధిదారులకు రెండుసార్లు ఇవ్వనున్నారని గర్భం దాల్చిన మూడు నెలలకు, ఆరు నెలల తర్వాత మరోసారి ఈ కిట్లు అందజేస్తారట.. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినట్టు తెలుస్తోంది..

TG ప్రజలకు శుభవార్త: మరో కొత్త పథకం.. పది రోజుల్లో అమలు..!!