రైతన్న అలర్ట్ : ఇక భారీ వర్షాలే.. ఎప్పటినుంచి అంటే..?

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వరి కోతలు జరిగి ధన్యమంతా ఆరబోత దశలో ఉంది.. ఈ తరుణంలో ప్రతిరోజు వాతావరణంలో మార్పులు రావడంతో ఓవైపు రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.. వర్షాలు వస్తే దాన్యం అంతా పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే ఒక బ్యాడ్ న్యూస్ అందింది.. ఈనెల 5వ తేదీ నుంచి దక్షిణ అండమాన్ సముద్రం మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడనుందని, ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా వెళ్లి ఏడవ తేదీ వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది..

దీని తర్వాత తమిళనాడు, పుదుచ్చేరి తీరం మీదుగా వెళ్తుందని శాఖ అంటుంది.. ఈ అల్పపీడన ప్రభావం వల్ల రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో 8,9 తేదీల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వాతావరణ శాఖ తెలియజేస్తోంది.. దీంతో రైతన్నలు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి కోతలు భారీగా సాగుతున్న సందర్భంలో ఈ వర్షం పడితే మాత్రం ధన్యమంతా వర్షార్పనమయ్యే అవకాశం ఉందని కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది..

దీనిపై ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి వరి కొనుగోలు స్పీడ్ గా చేయాలని ప్రజలు భావిస్తున్నారు. ఇదే విషయంపై వాతావరణ కేంద్రానికి చాలామంది ఫోన్లు చేసి మరీ తెలుసుకుంటున్నారు.. దీంతో అధికారులు మాట్లాడుతూ ఈనెల 5న అల్పపీడనం ఏర్పడితే గాని వర్షాలు ఏమాత్రం పడతాయనేది చెప్పలేమని వారు సమాధానం ఇస్తున్నారట. తూర్పు నుంచి వచ్చే గాలులు రాబోవు రెండు రోజుల్లో రాయలసీమ కోస్తా ప్రాంతంలో ఓ మోస్తారు వర్షాలు మాత్రం కురుస్తాయని అంటున్నారు.

రైతన్న అలర్ట్ : ఇక భారీ వర్షాలే.. ఎప్పటినుంచి అంటే..?