ప్రతి ఇంట్లో పిల్లలకు తల్లిదండ్రులే మొదటి గురువులు. తల్లిదండ్రులు ఏ విధంగా నడుచుకుంటారో పిల్లలు కూడా అదే బాటలో నడవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది.. కాబట్టి పిల్లల ముందు ఎలాంటి పనులు చేయాలో ఎలాంటివి చేయకూడదో తల్లిదండ్రులు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా చాలామంది ఇండ్లలో పిల్లల ముందే తల్లిదండ్రులు గొడవలు పడుతూ, బూతులు తిట్టుకుంటారు. ఒక్కోసారి కొట్టుకుంటారు కూడా. ఇలా చేయడం వల్ల ఆ పసి మనసులు గాయపడి వారు కూడా మిమ్మల్ని అనుకరించే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి పిల్లల ముందు అస్సలు చేయకూడని నాలుగు పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. అబద్ధాలు :
కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల ముందే తప్పు పనులు చేసి ఎవరికీ చెప్పకూడదని, ఎవరైనా అడిగితే వేరే విషయం చెప్పమని పిల్లల తోటి అబద్ధాలు చెప్పిస్తారు. ఉదాహరణ కొంతమంది తల్లిదండ్రులు ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని పిల్లలకు దొరికిపోతే మీ నాన్నకు చెప్పకు లేదా మీ అమ్మకు చెప్పకు అంటూ పిల్లలతో అబద్ధాలు చెప్పిస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా అబద్ధాలు చెప్పి వారి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
2. క్రమశిక్షణ లేకపోవడం:
పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులే.. తల్లిదండ్రుల హావాభావాలను బట్టి పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల ముందు తల్లిదండ్రులు కూడా క్రమశిక్షణతో మెలగాలి. అప్పుడు పిల్లలు కూడా మంచి దారిలో వెళ్లే అవకాశం ఉంటుంది.
3. అసభ్య పనులు :
చాలామంది తల్లిదండ్రులు పిల్లల ముందే అసభ్య పనులు చేస్తుంటారు.. ముద్దులు పెట్టుకోవడం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తుంటారు. ఇది పిల్లల ముందు చేయడం వల్ల వారి మైండ్ లో మీరు చేసే పనులు నిలిచిపోతాయి. కాబట్టి ఇలాంటి తప్పులు పిల్లల ముందు అసలు చేయవద్దు.
4. తిట్టుకోవడం:
కొంతమంది తల్లిదండ్రులు పిల్లల ముందే విపరీతంగా తిట్టుకుంటూ అసభ్య పదజాలాన్ని వాడతారు. ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా ఆ పదాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల ముందు అసభ్య పదజాలాన్ని ఉపయోగించకూడదని నిపుణులు అంటున్నారు.
పేరెంట్స్ పిల్లల ముందు అస్సలు చేయకూడని 4 పనులు.. ఏంటంటే..?