గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు మారిపోతున్నాయి.. ఏపీలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరియు చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే, ఇక తెలంగాణలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైయస్ షర్మిల తనదైన చతురత రాజకీయం చేస్తోంది. ఈ తరుణంలో ఆమె తలపెట్టిన పాదయాత్ర రసాబసాగా మారింది. దీంతో షర్మిలని అరెస్టు చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియా అంతా ఆమె చుట్టూ తిరగడం ఒక్కసారిగా వైయస్ షర్మిల పేరు మార్మోగిపోతుంది..
ఈ తరుణంలోనే వైసిపి పార్టీ మరియు టిఆర్ఎస్ పార్టీ మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ కేంద్రం విషయంలో మాత్రం ఇద్దరి రూట్లు వేరుగా ఉన్నాయి. కెసిఆర్ బిజెపితో శత్రుత్వం పెంచుకుంటుంటే, జగన్ వాళ్ళతో మిత్రుత్వం పెంచుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో బిజెపి సెకండ్ ప్లేస్ కు వచ్చింది కాబట్టి కెసిఆర్ బిజెపితో ఫైట్ చేస్తున్నారు, ఏపీలో బిజెపి అంతగా ఎఫెక్ట్ లేదు కాబట్టి జగన్ మోడీతో కలిసి పోతున్నారు. ఈ సందర్భంలో తెలంగాణలో రాజకీయం చాలా రసవత్తరంగా సాగుతోంది.
షర్మిల పాదయాత్ర నేపథ్యంలో ఎలాగైనా తెలంగాణ సెంటిమెంట్ ను బయట పెట్టాలని, షర్మిల పై దాడులు చేయడం, ఆమె టిఆర్ఎస్ పై విరుచుకుపడడం జరుగుతున్నాయి. ఈ తరుణంలోని నర్సంపేట ఎమ్మెల్యే సుదర్శన్ కెసిఆర్ ను ఒకటి కోరారుట, మీరు అనుమతి ఇవ్వండి సార్ నేను వెళ్లి ఆంధ్రాలో పర్యటిస్తాను. వారి తప్పులను ఎండగడతాను, ఆంధ్ర వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో మనల్ని ఎండగట్టేది ఏంటి అంటూ కోరినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే జగన్ నువ్వు మీ చెల్లిని అదుపులో పెట్టుకోవాలని చెప్పకనే టిఆర్ఎస్ చెప్పినట్లు కనబడుతోంది. మరి దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
వైసిపికి టిఆర్ఎస్ గట్టి వార్నింగ్.. ఏంటంటే..?