స్త్రీలు పాత గాజులను ఇలా పడేస్తున్నారా.. మీ భర్తకు తీరని నష్టం..!!

భారతదేశం అంటేనే స్త్రీలను ఆదిపరాశక్తిగా నమ్మే దేశం. అలాంటి ఈ దేశంలో స్త్రీలు నిండు వస్త్రాలతో, చేతినిండా గాజులతో కనిపిస్తూ ఉంటారు.. ఇది భారతీయ స్త్రీల యొక్క సాంప్రదాయంగా పూర్వకాలం నుంచి కొనసాగుతుంది.. స్త్రీలు ధరించే గాజుల వెనుక చాలా రకాల నియమాలు ఉన్నాయి.. స్త్రీలు వేసుకున్న గాజులను ఈ విధంగా అసలు పడేయకూడదని పడేస్తే భర్తకు తీరని నష్టం జరుగుతుందని సంప్రదాయ నిపుణులు అంటున్నారు.. నుదుట బొట్టు నుంచి కాళ్లకు పట్టీల వరకు ప్రతి దాని వెనుక ఒక అర్థం ఉంటుంది.

ముఖ్యంగా ఆడవారి చేతులకు గాజులు అందం, అలంకరణ. ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వెనుక సైన్స్ కూడా దాగి ఉంది. పూర్వకాలంలో మగవాళ్ళు చాలా కష్టాలు చేసేవారు. శారీరకంగా చాలా పనులు చేసేవారు. కానీ మహిళలు ఇంటిపనికే పరిమితమయ్యేవారు. ఈ విధంగా ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఇంట్లో ఉండటం వల్ల మహిళలు ఎక్కువగా రక్తపోటు సమస్యతో బాధపడేవారు. దీంతో ఆలోచన చేసిన పూర్వీకులు వాళ్ళ చేతికి గాజులు వేసుకునే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. మణికట్టుపై ఉండే గాజులు శరీరాన్ని ఆక్టివేట్ చేస్తాయి. ఈ గాజులు ఒకదానికొకటి రాపిడి చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.

అలాగే మట్టి గాజులు ధరించడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వేడి తగ్గి చలువ చేస్తుందని అంటుంటారు. అంతేకాకుండా వివాహం జరిగిన స్త్రీలు వేసుకున్న గాజులను తొలగించకుండా నిండు ముత్తైదులా ఉండాలని అలా ఉండడం వల్ల చేసుకున్న భర్తకు ఎలాంటి హాని జరగదని సంసార జీవితం సుఖంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పగిలిపోయిన, తీసివేసిన గాజులను ఎక్కడబడితే అక్కడ పడేయకూడదని ఏదో ఒక నిర్ణీత స్థలాన్ని నిర్ణయించుకుని అక్కడే పడేయాలని, ఇష్టం వచ్చిన దగ్గర వేస్తే ఇతరులకు గుచ్చుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

స్త్రీలు పాత గాజులను ఇలా పడేస్తున్నారా.. మీ భర్తకు తీరని నష్టం..!!