kartheeka deepam: కార్తీక మాసంలో 365 వత్తులు వెలిగించడానికి అసలు కారణం ఇదే..

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు. ఈ మాసం పరమ శివుడికి ఎంతో ప్రీతికరమైనది. కార్తీక మాసం ఆలయాన్నీ పండుగ శోభను సంతరించుకుంటాయి. ఈ నెల మొత్తం పూజలు, హోమాలు, వ్రతాలు, ఉపవాసాలు శుభకార్యాలను జరుపుకుంటారు. అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమిని ‘‘కార్తీక పౌర్ణమి’’అంటారు.

2022లో నవంబర్​ 8వ తేదీన కార్తీక పౌర్ణమిని జరుపుకుంటున్నారు. చంద్రగ్రహణం కారణంగా ప్రజలు ఒక రోజు ముందు. లేదా తర్వాతి రోజున వేడుకలు నిర్వహిస్తున్నారు.


అయితే కార్తీక మాసం రోజు ఆలయాల్లో లేదా ఇంట్లో ఉన్న దేవుడి ముందు, తులసి చెట్టు ముందు వత్తులు వెలిగించడం ద్వారా ఆ భగవంతుడి అనుగ్రహం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమి దీప దానం, ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్రమైన రోజున సత్యనారాయణ వ్రతం చేసినా లేదా ఈ వ్రతం కథను విన్న వారికి సకల శుభాలు కలుగుతాయి. ఇదే రోజున సాయంకాలం వేళ సంధ్యా సమయంలో ఏదైనా శివాలయంలో లేదా రావిచెట్టు దగ్గర లేదా తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించాలి.

కార్తీక పౌర్ణమి రోజు ఉదయం స్నానమాచరించి పెద్ద ఎత్తున భక్తులు దేవాలయాలను సందర్శించి దీపాలను వెలిగిస్తూ ఉంటారు.అయితే కార్తీక పౌర్ణమి రోజు రోజంతా ఉపవాసం ఉండి సంధ్యా సమయంలో 365 వత్తులను వెలిగించడం ద్వారా ఎంతో పుణ్య ఫలం దక్కుతుంది. సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి కాబట్టి, కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులను ఆవు నెయ్యి వేసి వెలిగించడం ద్వారా సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలం దక్కుతుంది.

కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం మాత్రమే కాదు.. దీప దానం, ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది. పురాణాల ప్రకారం, ఈ రోజున క్షీర సాగర దానానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజునే గౌరీ నోములు నోచుకుంటారు.

ఈ పవిత్రమైన పర్వదినాన తులసి చెట్టు పక్కనే ఉసిరికాయలను ఉంచి దాని పక్కన రాధాక్రిష్ణుల విగ్రహాన్ని పెట్టి వివాహం కానీ వారు పూజలు చేస్తే కోరుకున్న వారు భాగస్వామిగా లభిస్తారని భక్తుల నమ్మకం. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుంది. అలాగే లలితా సహస్రనామాలను చేస్తే సిరి సంపదలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం, లలిత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరీ స్తోత్రం, శివ సహస్రనామం, శివ పురాణాల పారాయణం చేయడం మంచిది. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి కాయలు లేదా ఉసిరి ఆకులను స్నానం చేసే నీటిలో చేర్చి స్నానమాచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం… ఇంకెందుకు ఆలస్యం వీలైన ప్రతి ఒక్కరూ మీ కుటుంబంలో శుభాలు కలగాలంటే ఈ రోజే దీపాలను వెలిగించండి.

kartheeka deepam: కార్తీక మాసంలో 365 వత్తులు వెలిగించడానికి అసలు కారణం ఇదే..