schools re open
TS SCHOOLS: తెలంగాణాలో వేసవి సెలవులు ముగిశాయి. రేపటి నుంచే (జూన్ 12) స్కూళ్లు పున: ప్రారంభం కానున్నాయి. అయితే.. రేపటి నుంచి స్కూళ్ల టైమింగ్స్ మారనున్నాయి. పూర్తి టైమ్ టేబుల్ ఇదే..
తెలంగాణాలో గత వారం నుంచి బడిబాట ప్రారంభమైంది. జూన్ 19 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచడమే భాగంగా రేవంత్ సర్కారు ప్రతిష్టాత్మకంగా బడిబాట నిర్వహిస్తోంది.
స్కూళ్ల టైమ్ టేబుల్లో మార్పులు
స్కూళ్ల టైమింగ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో 9.30 గంటలకు క్లాసులు ప్రారంభం అయ్యేవి. అయితే ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు 8.00 గంటలకే బస్సులు ఎక్కి పోతుంటే ప్రభుత్వ స్కూలు విద్యార్థులు మాత్రం ఆలస్యంగా వెళ్తున్నారని భావం తల్లిదండ్రుల్లో ఉందని ప్రభుత్వం భావించింది.
ఈ మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9.00 గంటలకే ప్రారంభించాలని 2024–25 అకడమిక్ క్యాలెండర్లో స్పష్టం చేసింది. ఉన్నత పాఠశాలలు మాత్రం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి. త్వరలోనే వీటి సమయం కూడా మార్పులు చేయనున్నట్టు సమాచారం.
SCHOOLS RE OPEN TOMORROW: రేపటి నుంచే స్కూళ్లు పున: ప్రారంభం