విద్యార్థులకు గుడ్న్యూస్.. స్కూళ్లకు, కాలేజీలకు రేపటి నుంచి 5రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఆదివారం, కార్తీక పౌర్ణమి, ఎన్నికల నిర్వహణ పోలింగ్ కారణాల రీత్యా.. వరస సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
నవంబర్ 26 ఆదివారం కాగా నవంబర్ 27 సోమవారం కార్తీక పౌర్ణమి పండుగ సెలవు ప్రకటించింది. నవంబర్ 28, నవంబర్ 29 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు కలిగిన స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ.. ప్రభుత్వం జీవో జారీ చేసింది.
నవంబర్ 30 రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఉన్నందున జనరల్ హాలిడే ప్రకటించారు. స్కూళ్లతో పాటు అన్ని రంగాల ఉద్యోగులకు సెలవు ఉంటుంది. వరస సెలవుల కారణంగా దూర ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులు సొంత ఊళ్లకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. తిరిగి డిసెంబర్ 01న స్కూళ్లు తెరుచుకోనున్నాయి.
5DAYS SCHOOL HOLIDAYS: విద్యార్థులకు గుడ్న్యూస్..5రోజులు సెలవులు