Money:అదిరే ఆఫర్.. ఉచితంగా బ్యాంక్ అకౌంట్ లోకి 10 వేలు..ఎలా అంటే..?

కేంద్ర ప్రభుత్వం అదిరే ఆఫర్ ఇస్తోంది.. వారు నిర్వహించే ఒక కాంటెస్ట్ లో పాల్గొని విజేతగా నిలిస్తే పదివేల రూపాయలు మన సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఆ కాంటెస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కాంటెస్ట్ ను నిర్వహిస్తుందట.. దీంతో కొత్త సంవత్సరంలో పదివేల రూపాయలు పొందే అవకాశం మీ సొంతం.. కేంద్ర సర్కార్ కు సంబంధించిన మైగావ్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని పొందుపరిచింది.. ట్విట్ ప్రకారం చూస్తే మీరు జింగిల్ రూపొందించాల్సి ఉంటుంది.

మీరు రూపొందించిన జింగిల్ చాలా బాగుండి, అందరికీ నచ్చితే 10000 రూపాయలు మీరు గెలుచుకోవచ్చు. అంతేకాకుండా ఇతర బహుమతులు కూడా ఉన్నాయి. మీరు రూపొందించే జింగిల్ కూడా రిపబ్లిక్ డేకు సంబంధించి ఉండాలి. అది వినసొంపుగా, దేశభక్తిని పెంపొందించేలా జింగిల్ రూపొందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు రూపొందించే జింగిల్ అన్ని వయసుల వారికి అర్థం కావాలి. రిపబ్లిక్ డే చరిత్రను చెప్పాలి. ఈ విధంగా అన్ని హంగులు కలిగి, ప్రజలను మెప్పిస్తే డబ్బులు మీ సొంతమవుతాయి.

మీరు నిర్మించే జింగిల్ 25 నుంచి 30 సెకండ్ల వరకు ఉండాలి. మీరు రూపొందించే స్క్రిప్ట్ ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. హై క్వాలిటీ ఆడియో ఫైల్ రూపంలో మీ జింగిల్ ను అప్లోడ్ చేయాలి. అంతేకాకుండా స్క్రిప్టును పిడిఎఫ్ డాక్యుమెంట్ రూపంలో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. జనవరి 20 లోగా మీ జింగిల్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ కాంటెస్ట్ లో మొదటి స్థానం సాధించిన వారికి 10000, రెండో స్థానంలో ఉన్న వారికి 7000, మూడవ స్థానంలో ఉన్న వారికి 5000 రూపాయలు వస్తాయని తెలుపుతోంది.