10 days SCHOOL HOLIDAYS AUGUST: ఆగస్టు నెలలో స్కూళ్లకు భారీ సెలవులు

SCHOOL HOLIDAYS IN AUGUST 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రెండు రాష్ట్రాల అడమిక్​ క్యాలెండర్​ 2024–25 ప్రకారం ఆగస్టు నెలలో విద్యార్థులు భారీగా సెలవులు రానున్నాయి. సెలవుల పూర్తి వివరాలు తేదీలతో పాటు ఇక్కడ తెలుసుకుందాం.

ap telangana logo

ఆగస్టు నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. జూలై నెలాఖరు వరకు పరీక్షలతో బీజీబిజీగా గడిపిన విద్యార్థులకు ఆగస్టు నెలలో వచ్చే పండుగ సెలవులు రిలీఫ్ ఇవ్వనున్నాయి.

ఆగస్టు నెలలో ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, శ్రీ కృష్ణాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు రానున్నాయి. ఇవి నాలుగు రోజులు పండుగ సెలవులు పోనూ.. మిగతా నాలుగు ఆదివారాలు, రెండో శనివారం రానుంది. దీంతో సుమారు 10 రోజుల వరకు ఆగస్టు నెలలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రానున్నాయి.

సెలవులు వివరాలు

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం కావడంతో రెండు రోజులు వరస సెలవులు రానున్నాయి. ఆగస్టు 19న రాఖీ పౌర్ణమి సెలవు ఉంటుంది. దీంతో పాటు ఆగస్టు 26న శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవు ఉంది. ఆగస్టు 04, 11, 18, 25 తేదీల్లో ఆదివారాలు, ఆగస్ట్​ 10న రెండో శనివారం సెలవు రానుంది.

మరిన్ని వార్తల కోసం ఈ పీజీలో ఫాలో అవ్వండి.

10 days SCHOOL HOLIDAYS AUGUST: ఆగస్టు నెలలో స్కూళ్లకు భారీ సెలవులు