జాతీయస్థాయి రాజకీయాల దిశ గా కేసిఆర్ తొలి అడుగు పడింది. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించారు. కేసిఆర్ టిఆర్ఎస్ పార్టీ పై బిజెపి పార్టీ నాయకులు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని చక్కదిద్దలేని కేసీఆర్ దేశాన్ని బాగు చేస్తా అంటున్నాడని ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అనే పదాన్ని రద్దు చేసుకొని బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతోనే కేసీఆర్ కి తెలంగాణకి మధ్య ఉన్న బంధం తెగిపోయిందని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కేసిఆర్ ప్రభుత్వం 2018 ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి, ఆ హామీలు నెరవేర్చకుండా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేస్తూ సమస్యల పరిష్కారాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఈటెల రాజేందర్ విమర్శించారు.
కేసీఆర్ ఎన్ని అబద్దపు మాటలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రత్యామ్నాయ పార్టీగా బిజెపికి మాత్రమే అది సాధ్యమవుతుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఎగిరేది కాషాయం జెండానే అని పేర్కొన్న ఈటెల రాజేందర్ నల్గొండ జిల్లాలో గ్రామ గ్రామానికి ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పై ఈటల ఎదురుదెబ్బ.. అంత మాట అన్నాడా..?